మా గ్రామంలో మద్యం.. వద్దే వద్దు !

మద్యపానంపై నిషేధం విధించాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

 

ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అరకగూడెం మండలం వెంకటాపురం పంచాయతీ గ్రామస్థులు నడుంబిగించారు.

మద్యపాన నిషేధం కోసం పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం అందజేసిన సర్పంచ్ చౌలం కేశవరావు గారు, ఉపసర్పంచ్ ఈసం కోటేశ్వరరావు గారు మరియు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు..

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం  /ఈ రోజు (గురువారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరుతూ పోలీసు అధికారులకు వినతిపత్రం సమర్పించిన సర్పంచ్ చౌలం కేశవరావు, ఉపసర్పంచ్ *ఈసం కోటేశ్వరరావు, మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

మద్యం సేవించడం వల్ల గ్రామంలో వచ్చే అనారోగ్యాలు, సమస్యలపై వారు మాట్లాడారు..

➡️ గ్రామంలో పెరుగుతున్న మద్యపాన ప్రభావం వల్ల కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️ గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశంలో మద్యపాన నిషేధంపై తీర్మానం చేయబడినట్లు తెలిపారు.

➡️ గ్రామ పరిధిలో ఎవరైనా మద్యం విక్రయం లేదా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే వారికి రూ.25,000/- జరిమానా విధించాలని తీర్మానించామని వెల్లడించారు.

➡️ అదేవిధంగా, మద్యం అక్రమ విక్రయాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించి పట్టించేందుకు సహకరించిన వారికి ప్రోత్సాహకంగా రూ.2,000/- నగదు బహుమతి అందజేయాలని నిర్ణయించామని తెలిపారు.

గ్రామంలో మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకొని, యువత భవిష్యత్తు దృష్ట్యా మద్యపానాన్ని పూర్తిగా అరికట్టాలని వారు పోలీసు అధికారులను కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram