ఉమెన్స్ డే వేళ కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం!

మహీళా దినోత్సవం వేళ కామారెడ్డిలో ఘోరం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో చెరువులో పడిసిన తండ్రి!

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ కామారెడ్డి జిల్లాలో గుండెలవిసే విషాద ఘటన చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడిగా మారి, తన ముగ్గురు కుమార్తెలను చెరువులో తోసి కిరాతకంగా చంపేశాడు. ఈ మనసు కలిచివేసే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణం ఆర్బీ నగర్కు చెందిన ఇస్మాయిల్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతడికి షీపత్ (8), ఆయత్ (7), మరియం (5) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నీటిలోకి తోసేసి హత్య చేశాడు వెలుగుచూసింది.

 

తొలుత తన బిడ్డలు అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. కానీ విచారణలో అసలు నిజం ఒప్పుకున్నాడు. ₹5 లక్షల అప్పు భారం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపాడు.

 

ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇస్మాయిల్, కూలి పనులకు వెళ్తున్న భార్య షబీనా కష్టాన్ని కూడా చూడకుండా.. పసి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram