జీతాలు పెంచమంటే అరెస్టులు చేస్తారా

జీతాలు పెంచమంటే అరెస్టులు చేస్తారా

 ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న ముఖ్యమంత్రి

పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం – సిఐటియు 

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని ఇప్పుడు అధికారంలోకి వచ్చే మూడు సంవత్సరాలు గడుస్తున్నా. జీతాలు పెంచలేదని జీతాలు పెంచాలని అడిగినందుకు, హైదరాబాదులో ధర్నా చేసేందుకు వెళుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను అక్రమంగా అరెస్టులు చేయటాన్ని మరియు హైదరాబాద్ లో ధర్నాలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ సహా వందలాది మంది సిఐటియు మరియు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను అరెస్టులు చేయటాన్ని నిరసిస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు కరకగూడెం మండలం కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా CITU మండల కన్వీనర్ కొమరం కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పుతుందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ముఖ్యమంత్రి, మంత్రులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లకు,హెల్పర్లకు కనీస వేతనం 26,000 ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటీ చట్టాన్ని అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ మరియు హెల్పర్ పోస్ట్లు భర్తీ చేయాలని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ కేంద్రాలపై సర్పంచుల పెత్తనాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను సిఐటియు నాయకులు విడుదల చేయాలని ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు .విద్యాశాఖ అమలు చేస్తున్న విధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక్క పూట స్కూల్ నిర్వహణ మే నెల మొత్తం డిమాండ్ చేశారు. ప్రభుత్వంపోలీసులను ఉపయోగించి అరెస్టులు చేసి నిర్బంధాన్ని ప్రయోగిస్తే అంతకంటే తీవ్రస్థాయిలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు భవాని, మంగతాయారు, సుజాత, స్వరూప, రమాదేవి, పద్మ, శిరీష, సావిత్రి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram