ఒక రీల్ చూసి… ఆ గ్రామం మారిపోయింది

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ సోషల్ మీడియాలో చూసిన ఒక చిన్న అవగాహన వీడియో… ఇప్పుడు గుండంపల్లి గ్రామంలో పెద్ద మార్పుకు దారి తీసింది. దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామపంచాయతీ వినూత్నంగా “స్టీల్ బ్యాంక్” ఏర్పాటు చేసి, 500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచింది.

 

గ్రామంలో జరిగే వివాహాలు, విందు కార్యక్రమాలకు అవసరమైన వారు వీటిని తీసుకెళ్లి ఉపయోగించి… తిరిగి శుభ్రం చేసి ఇస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం గణనీయంగా తగ్గింది.

 

ఇటీవల వైరల్ అయిన వీడియోల్లో పేపర్ ప్లేట్లపై ఉన్న పాలిథిన్ పొర గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి ఆహారం వల్ల ప్లాస్టిక్ కరిగి ఆరోగ్యానికి హానికరం అవుతుందని… పర్యావరణానికి కూడా నష్టం కలుగుతుందని చెప్పారు.

 

గుండంపల్లి తీసుకున్న ఈ చిన్న నిర్ణయం…

పెద్ద మార్పుకు నాంది పలికింది.

 

ఒక గ్రామంలో 500 స్టీల్ ప్లేట్లు 20 కార్యక్రమాల్లో వాడితే… 10,000 ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం తగ్గినట్టే. అదే ప్రతి గ్రామం చేస్తే… పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో ఊహించండి.

 

నిర్మల్ జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి… స్టీల్ వస్తువులనే ఉపయోగిస్తున్నారు. మోదుగ ఆకులతో తయారయ్యే విస్తరాకులు కూడా మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

 

వీడియోలు చూడటం ఒక్కటే కాదు…

మార్పు మన నుంచే మొదలవ్వాలి.

 

చిన్న అలవాటు మార్చితే…పెద్ద ప్రకృతి కాపాడినట్టే.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram