తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3 మహాసభలను జయప్రదం చేయాలి

 

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3 మహాసభలను జయప్రదం చేయాలని. రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మా పిలుపునిచ్చారు 

గోల్డెన్ న్యూస్ / బూర్గంపాడు / బూర్గంపాడు మండల మహాసభ టేకుల చెరువు గ్రామంలో సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మా మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఏప్రిల్ 23 -24 -25 లో మహాసభలను జయప్రదం చేయాలని రైతంగానికి అండగా నిలబడి రైతంగం హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నామని అఖిలభారత కిసాన్ సభ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగానికి మద్దతుగా పోరాడుతున్నామని అన్నారు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టేకులచెరువు గ్రామంలో 500 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ భూమి రైతులకి హక్కు లేకుండా ప్రభుత్వం భూమి గట్టు నెంబరు భూమి అని రైతుల్ని ఇబ్బంది పెడుతున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వం భూమి ఒక దగ్గర సర్వే నెంబరు వేరే దగ్గర ఉంది అందుకు ప్రభుత్వం సర్వే చేసి ఆ భూములు వారికి వర్తించే విధంగా సర్వే నెంబరు వేయాలని రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు

వారి సమస్య పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని

అన్నారు

కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పల ని చూస్తున్నా బిజెపి ప్రభుత్వం విధానాలని ఎండగట్టి వ్యవసాయాన్ని రక్షించటం కోసం ఢిల్లీలో 13 నెలలపాటు 3 నల్ల చట్టాలను వ్యతిరేకంగా రైతాంగాని సమీకూరించి పోరాడి విజయం సాధించింది అఖిలభారత కిసాన్ సభ ప్రభుత్వం తాత్కాలికంగా వెనుక్కు తగ్గిన రైతులకు ప్రమాదం పోంంచే ఉందని తెలిపారు

దేశంలో రైతు సంఘం ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ప్రకారం మద్దతు ధర పంటలకు బీమా సౌకారం కల్పించాలని డిమాండ్ చేశారు

టేకుల చెరువు సర్పంచ్ బోళ్ళ సైదమ్మ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు 40% నిధులు ప్రభుత్వం ఇవ్వాలని గ్రామాలు అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం వెంటనే ఈ నిధుల్ని విడుదల చేయాలని కోరారు

 

నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది మొత్తం పదిమంది అధ్యక్షులు బోళ్ళ శ్రీశైలం, కార్యదర్శి కందుకూరి నాగేశ్వరావు, సహాయ కార్యదర్శి పాండవుల రావనాదం, ఉప అధ్యక్షులు కొమర్రాజు సత్యనారాయణ, సభ్యులు నిమ్మల అప్పారావు, దామోదర్ రెడ్డి, పుల్లారెడ్డి, బిచ్చమయ్య, కాక రాఘవమ్మ, తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram