ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
గోల్డెన్ న్యూస్ / భద్రాచలం / భద్రాచలం నియోజకవర్గం. దుమ్ముగూడెం మండలంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
గుంట పద్మ, చిలగంజి తులసి గార్ల ఇందిరమ్మ ఇల్లులు గృహప్రవేశం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవారు లబ్ధి పొందాలని తెలిపారు. పేదలు ఇల్లు నిర్మించుకునే కల నెరవేరుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే గారిని లబ్ధిదారుల కుటుంబ సభ్యులు అభినందించారు…
అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించారు…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు…








