లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బీట్ ఆఫీసర్ నరేష్

ఫారెస్ట్ బీట్ అధికారిపై ఏసీబీ దాడి..

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

 

గోల్డెన్ న్యూస్/గుండాల/పోడు రైతు నుంచి రూ.10,000 లంచం తీసుకుంటున్న సమయంలో గుండాల మండలంలోని నడిమిగూడెం ఫారెస్ట్ బీట్ అధికారి బానోతు నరేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువారం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 

సమాచారం ప్రకారం, గుండాల మండలం సాయనపల్లి గ్రామానికి చెందిన ఓ పోడు రైతును ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు బీట్ అధికారి నరేష్ రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు ఉచ్చుపన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

 

మారు మూల గ్రామాల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంలో ఏసీబీ అధికారులు చురుకుగా వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో అవగాహన పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తున్న ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు.

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram