గోదావరిలో ఇద్దరు గల్లంతు

గోల్డెన్ న్యూస్ / ఏటూరునాగారం / ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం లోని గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు నరేష్, పండు, సంపత్ అనే ముగ్గురు గోదావరి నదిలో ఈతకు వెళ్ళగా నరేష్, పండు నది ప్రవాహంలో గల్లంతు అయ్యారు సంపత్ ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డాడు గమనించిన స్థానికులు సంపత్ ను ఆస్పత్రికి తరలించగా మిగతా ఇద్దరి కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు, గ్రామస్తుల సహకారంతో ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గల్లంతైన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్ను అంటుతున్నాయి

Facebook
WhatsApp
Twitter
Telegram