తుడుం దెబ్బ బహిరంగ సభ ను విజయ వంతం చేయండి

తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా.మైపతి అరుణ్ కుమార్  పిలుపు..

కరకగూడెం మండల కేంద్రం నుండి పిలుపునిచ్చిన – భద్రాద్రి జిల్లా తుడుందెబ్బ – ఏ ఎస్ యు

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / కరకగూడెం  మండల కేంద్రం లో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనారాయణ, తుడుందెబ్బ భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలం వేణుగోపాల్  అధ్యక్షణన అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశానికి  తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా.మైపతి అరుణ్ కుమార్  హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ ..జూన్ 3 తేదీన మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడ మండల కేంద్రం లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యం లో లంబాడీ లు ఎస్టీలు  కాదు అని భారీ బహిరంగ సభ నిర్వహణ చేయనున్నట్లు తెలిపారు.

 

1976 నుండి 2026 వరకు 50 సంవత్సరాలు ఆదివాసీల రిజర్వేషన్లను అక్రమంగా దోచుకు తింటున్న లంబాడీలు అక్రమంగా ఎస్టీ జాబితాలో చేరి ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు అని ఉవ్వెత్తున ఉద్యమాలు లేచిన కాని నేడు ప్రభుత్వం గాని వివిధ రాజకీయ పార్టీ లు కానీ లంబాడా సమస్య పై మాట్లాడే పరిస్థితి లేదు అన్నారు. ఏజెన్సీ సర్టిఫికేట్ లు లేక ఏజెన్సీ ఉద్యోగాలు రాక ఏజెన్సీ డి ఎస్సీ లు లేక ఆదివాసీ నిరుద్యోగ యువత రోజు రోజుకు పెరిగి పోతుంది అన్నారు ఐటిడిఎ ల ద్వారా జరగాల్సిన ఉద్యోగ ప్రక్రియ జీవో 317 పేరిట నూతన జోనల్ విధానం తో నేడు టి ఎస్ పి ఎస్ సి లాంటి సంస్థలు ఏజెన్సీ జీవో లను షెడ్యూల్ 5 ను బొంద పెట్టి జనరల్ రూల్ అప్ రిజర్వేషన్ అమలు చేయటం తో ఉద్యోగాలు రాని పరిస్థితి, పోడు భూములకు పట్టాలు లేవు ఉన్న భూములకు దిక్కు లేదు అందులో బోర్లు వేస్తే అటవీ శాఖ గోస పెడుతుంది అందుకే ఆదివాసీ అస్తిత్వం లో ఆదివాసీ పోరుకేక బహిరంగ సభ జరుపుతున్న క్రమం లో ఆదివాసీ లు వేలాదిగా తరలి వచ్చి ప్రభుత్వం కి మన సత్తా ఏమిటో చూపేలా సభ నడపాలని పిలునిచ్చారు ఆదివాసీ ఉద్యోగులు మహిళలు విద్యార్థులు ఈ సభ ను విజయవంతం చేయాలని పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో..జిల్లా ప్రచార కార్యదర్శి సుతారి నాగేశ్వరావు,మండల ప్రధాన కార్యదర్శి కలం సంపత్ కుమార్, జేఏసీ ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి, సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు చందా రామ కృష్ణ, ఏ ఎస్ యు భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు – ఇర్ప నాగకృష్ణ , ఏ ఎస్ యు భద్రాద్రి జిల్లా అధికార ప్రతినిధి , కోశాధికారి – పోలెబోయిన స్వామిప్రసాద్ , పోలేబోయిన రాజు పోలెబోయిన వెంకటేష్ , యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram