బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కోలేటి భవానీశంకర్ సస్పెన్షన్

గోల్డెన్ న్యూస్/ పినపాక / పార్టీ కార్యకలాపాలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు పినపాకకు చెందిన కోలేటి భవానీశంకర్‌ను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పినపాక మండల బీఆర్‌ఎస్ అడహాక్ కమిటీ ప్రకటించింది.

 

గురువారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన ముఖ్య కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మండల అడహాక్ కమిటీ అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ మంత్రిని ప్రశంసిస్తూ ప్రెస్‌నోట్లు విడుదల చేయడం, ప్రెస్‌మీట్లు నిర్వహించడం పార్టీ వ్యతిరేక చర్యగా గుర్తించామని తెలిపారు.

 

అలాగే ఇతర మండలాల్లోని బీఆర్‌ఎస్ నాయకులకు ఫోన్లు చేసి కాంగ్రెస్ పార్టీ మంత్రిని కలవాలని, సంబరాల్లో పాల్గొనాలని కోరడం కూడా తప్పుగా నిర్ధారించామని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రిని పొగడడం, ప్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్లనే భవానీశంకర్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

 

భవిష్యత్తులో కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై కోలేటి భవానీశంకర్‌కు బీఆర్‌ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

 

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పొనుగోటి భద్రయ్య, దాట్ల వాసుబాబు, పీఏసీఎస్ చైర్మన్ రవివర్మ, పోలిశెట్టి సత్తిబాబు, గుమ్మడి గాంధీ, రాయల బాబు, బత్తుల వెంకటరెడ్డి, దొడ్డా శ్రీనివాస్ రెడ్డి, కొండేరు నాగభూషణం, ముక్కు నాసర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram