సింగరేణి కొలువులో ఆదివాసి ఆణిముత్యం

– శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఎంపికైన పాయం రామక్రిష్ణ

– సీఎంఓ ఆర్‌.కిరణ్ రాజు కుమార్ చేతుల మీదుగా పదవి బాధ్యతలు అప్పగింత 

– రామక్రిష్ణను అభినంధించిన గ్రామస్తులు

 

గోల్డెన్ న్యూస్  /కరకగూడెం / ఏజెన్సీ కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన పాయం కన్నయ్య-లక్ష్మి దంపతుల రెండో కుమారుడు పాయం రామకృష్ణ ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకొని సింగరేణి సంస్థలో 2020లో సింగరేణి ఉద్యోగం సాధించి,శ్రీరాంపూర్ సింగరేణి అండర్ గ్రౌండ్ ట్రామర్ గా విధు మరొక గోడలు చేపట్టారు.అనంతరం సింగరేణిలో 2024 శానిటరీ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కు సిద్ధమై ఓపెన్ కేటగిరీలో సింగరేణి శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం సాధించాడు.రామక్రిష్ణ 2004లో భద్రాచలం కొత్తూరు నారాయణపురం ఆశ్రమ ఉన్నత పాఠశాల పదో తరగతిలో 513 మార్కులతో భద్రాచలం డివిజన్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు.అప్పుడు ఉన్న పరిస్థితుల్లో పదో తరగతి పాస్ అవ్వాలంటే సాధ్యం కాని పరిస్థితి.ఇంటర్మీడియట్ చదువుతూ ఆర్ఎంపి వైద్యుడిగా పని చేస్తూ ఇంటర్మీడియట్,డిగ్రీ,పీజీ(కెమిస్ట్రీ),బీఈడీ పూర్తి చేసుకుని 2020లో గురుకులంలో ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుడిగా సేవలందించాడు.కరోనా ప్రభావంతో మళ్ళీ ఆర్ఎంపి గా పని చేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వహించాడు.తరువాత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో 2022లో సింగరేణి సంస్థలో అండర్ గ్రౌండ్ ట్రామర్ ఉద్యోగం సాధించి,విధులు నిర్వహిస్తున్న సమయంలో సింగరణి శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించడం విశేషం.శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించిన రామకృష్ణ మాట్లాడుతూ‌.. తన వ్యక్తిగత విజయాలతో ఆగిపోకుండా గ్రామీణ ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో 12 లక్షల పెట్టుబడితో ఆర్కే మార్ట్ ఫర్ ఆల్ ఈవెంట్స్ పేరుతో బిజినెస్ ప్రారంభించి,ఉద్యోగం లేక బాధపడుతున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి,ఆర్థిక భరోసా అందిస్తున్నాడు.ప్రతి ఒక్కరికి కల ఉంటుంది.ఆ కలను సహకారం చేసుకోవాలంటే కష్టపడాలని సూచించారు.ముఖ్యంగా ఏజెన్సీలో కష్టపడకుండా ఉద్యోగం సాధించాలంటే అసలు సాద్యం కాదని.మనలో మనకు సంకల్పం ఉంటే ఎంతటి దైన సాధ్యమవుతుందని తెలిపారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని స్థిరపడే విధంగా ముందుకు కొనసాగాలని సూచించారు.నేను పేద కుటుంబంలో పుట్టి నా తల్లిదండ్రులను కష్టపడి చదివించి ఇంతటి శ్రీకారం చుట్టినందుకు వారి రుణం ఎప్పటికీ మర్చిపోలేని జీవితాంతం వారికి రుణపడి ఉంటానని అన్నారు.ప్రజా ఆరోగ్యం,పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత పర్యవేక్షించే ఉద్యోగం సింగరేణిలో సాధించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. సింగరేణి సంస్థ ఉద్యోగం సాధించినందుకు గ్రామస్తులు రామకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram