మావోయిస్టు కీలక నేత లొంగుబాటు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగిపోయారు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగిపోయారు. భార్యతో కలసి పోలీసుల ఎదుట నరహరి లొంగిపోయారు. నరహరితో పాటు మరో నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. నరహరి లొంగుబాటును పోలీసులు ఈరోజు అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

 

వందలాది మంది …

ఇటీవల కాలంలో వరసగా మావోయిస్టు కీలక నేతలందరూ లొంగిపోతున్నారు. ఆపరేషన్ కగార్ గడువు ముగిసినప్పటికీ ఇప్పటికీ మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కోసం ఇంకా భద్రతాదళాలు జల్లెడ పడుతుండటంతో ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు.

Facebook
WhatsApp
Twitter
Telegram