ఘనంగా బక్రీద్ వేడుకలు

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం / త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ (ఈద్-ఉల్-అజ్ఞా) పండుగను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తో పాటు కరకగూడెం మండలం మండలంలో గురువారం ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మోతే శివారులోని అటవీ ప్రాంతంలో  వద్ద మైదానంలో ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువు  బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను, దాని విశిష్టతను ముస్లిం సోదరులకు వివరించారు. పవిత్ర ఖురాన్ బోధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతియుతంగా జీవించాలని, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పేదలకు సహాయం చేస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రార్థనల అనంతరం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ర్థనలు (నమాజ్) నిర్వహించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram