తెలంగాణలో రానున్న 7 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో రానున్న 7 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

 

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ /రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు నుంచి శుక్రవారం, శనివారం వరకు వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram