గోల్డెన్ న్యూస్ / వెబ్స్ డెస్క్ / ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, సిద్ధిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా రోజంతా మేఘావృత వాతావరణం కొనసాగనుంది.
⇒హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉంది.
Post Views: 261









