గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం /జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామపంచాయతీల (GPs)లో అంగన్వాడీ టీచర్ (ఏ డబ్ల్యు టి) పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణకు నేటితో (18-07-2026) గడువు ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు గడువు లోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.
దరఖాస్తు చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన (స్క్రూటినీ) 20-07-2026 నుండి 27-07-2026 వరకు సంబంధిత ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించబడుతుంది. స్క్రూటినీకి హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, అటెస్టేషన్ చేయించిన రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాత్రమే స్క్రూటినీకి హాజరు కావాలని స్పష్టం చేశారు.
Post Views: 188









