గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో గురువారం స్థానిక పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాల తనిఖీలో భాగంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, ఓవర్ లోడ్‌తో తరలి వెళ్తున్న ఆటోలను ఆపి తనిఖీలు చేశారు. సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలను, నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలను, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం ఎస్ఐ పివీయన్ రావు, హెడ్ కానిస్టేబుల్ కనకేష్ కుమార్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 218









