గోల్డెన్ న్యూస్/మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బీటీపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీఏవీ పాఠశాలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ప్రారంభించారు. పాఠశాల భవనాన్ని పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యా యులతో మాట్లాడారు. అనంతరం జరిగిన సభలో నాణ్యమైన విద్య రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే పయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు కళ్ళ వెంకటేశ్వరరావు , ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
Post Views: 20









