గోల్డెన్ న్యూస్ /బూర్గంపాడు / టేకులచెరువు గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు డబుల్ బెడ్ రూములు గత ఐదు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉండటం వల్ల ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం కలెక్టర్ కు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అందజేశారు
వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ అధికారం లో ఉన్నప్పుడు నిర్మాణం జరిగిందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టేకులచెరువు గ్రామానికి చెందిన 40 కుటుంబాలకి అధికారికంగా ప్రకటించి ఇంత మట్టికి ఇవ్వకపోవడం వల్ల కలెక్టర్ దృష్టికి తీసుకురటం జరిగింది వెంటనే కలెక్టర్ స్పందించి హౌసింగ్ బోర్డు అధికారులకు నెల రోజులలో డబ్బులు బెడ్ రూములు నిర్మాణాన్ని పూర్తి చేసి 40 కుటుంబాలకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు
వారికి డబల్ బెడ్ రూమ్ కుటుంబాలు హర్షం వ్యక్తం చేశారు నెల రోజుల్లో ఇవ్వలేకపోతే అధికారికంగా ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వారికి కేటాయించాల్సిన అవసరం ఉందని అని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పాండవుల రామనాథం, శాఖ కార్యదర్శి బోల్ల శ్రీశైలం, ఎంఎల్ పార్టీ నాయకుడు జక్కుల రాంబాబు, సంపత్, పాల్గొన్నారు.









