గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం/ పాల్వంచ మండలంలోని తొగ్గూడెం ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారితో పాటు సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి స్వతంత్ర విచారణ చేపట్టాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం సేవాలాల్ సేన ఆధ్వర్యంలో గిరిజన సంఘాలు కలెక్టరేట్‌ను ముట్టడించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాయి. ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ మాట్లాడుతూ.. మైనింగ్ శాఖ అధికారులు తోగ్గూడెం క్వారీలను మూడు సార్లు సీజ్ చేసిన విషయమే అక్కడ అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తోందన్నారు. ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడే అధికారులు స్పందించడం, కొద్దిరోజుల్లోనే తిరిగి మళ్లీ తవ్వకాలకు అవకాశం కల్పించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.
సమాచార హక్కు చట్టం కింద తప్పుడు వివరాలు ఇచ్చి, అక్రమంగా తవ్విన ఖనిజ పరిమాణాన్ని తక్కువగా చూపించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. జిల్లా మైనింగ్ శాఖ అధికారుల పాత్రపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే జిల్లా అధికారుల కార్యాలయాల ముట్టడి, రహదారుల దిగ్బంధనం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, ఉపాధ్యక్షుడు బోడ రమేష్ నాయక్, అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, కార్యదర్శి బాదావత్ సురేష్ నాయక్, ప్రచార కార్యదర్శి జరపల లాలు నాయక్‌తో పాటు పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల గిరిజన నాయకులు, యువజన ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.









