గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి లొంగదీసుకున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని తెలిపారు. తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు తీసి వేధించారని ఆరోపించారు. కాగా కాంతారావు భద్రాద్రి జిల్లా పినపాక శాసనసభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
Post Views: 550









