గోల్డెన్ న్యూస్/వెబ్ డెస్క్/ ములుగు జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకోండి. ఏం చేస్తున్నావ్ మనవరాలా అంటూ ఇంట్లో దూరి ఆమెను తాళ్లతో కాళ్లూచేతులు కట్టేసి అత్యాచారం చేసాడు ఓ కామాంధ తాతయ్య. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ బాలికను బెదిరించాడు. కామాంధుడి లైంగిక దాడి వల్ల 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. గత కొన్నిరోజులుగా బాధితురాలు తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతుండగా ఆమె నానమ్మ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించింది.
పరీక్షించిన వైద్యులు బాలిక గర్భం దాల్చిందని చెప్పారు. దీనితో బాలికను గట్టిగా నిలదీయడంతో తనపై తాతయ్య అత్యాచారం చేసాడని చెప్పింది. దీనిపై కామాంధుడు కృష్ణయ్యను ప్రశ్నిస్తే… అబార్షన్ చేయించి బాలికకు మరో పెళ్లి చేస్తానని తాపీగా చెప్పాడు. ఐతే బాధిత బాలిక గురించి ఏమీ పట్టించుకోకుండా తప్పించుకు తిరగుతుండటంతో ఆమె విషయాన్ని మీడియా ముందు చెప్పి వాపోయింది.









