గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /పశువులను అక్రమ రవాణా చేస్తున్న రెండు దోస్త్ వాహనాలను పట్టుకుని, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున కరకగడెం పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు.
రెండు అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన దోస్త్ వాహనాల్లో పశువులను తరలిస్తున్నరు. వాహనాలను ఆపి పశువులకు సంబంధించి పత్రాలు పరిశీలించగా వారి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో 11 పశువులను పాల్వంచ గో సంరక్షణకు అప్పగించి. వాటిని తరలిస్తున్న వ్యక్తులైన బానోతు మొగిలి బానోతు శ్రీకాంత్, అంగోతు విజేందర్ మరియు కాసుమంచి శ్రీకాంత్ మీద కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ పీవీ నాగేశ్వరరావు తెలిపారు. పశువు తరలించే వ్యక్తులు వదినేపల్లి గ్రామం బుధరావుపేట పంచాయతీ ఖానాపూర్ మండలం వరంగల్ జిల్లాకి చెందిన వారుగా తెలిపారు.










