పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు

పోక్సో కేసులో కఠిన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు, బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం

 

గోల్డెన్ న్యూస్ / మెదక్ /మెదక్ జిల్లా నార్సింగి మండలంలో 2024లో జరిగిన పోక్సో కేసులో జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు బుధవారం (ఆగస్టు 5) కఠిన తీర్పు వెలువరించింది. మాయమాటలు చెప్పి ఓ బాలికను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన అక్తర్ 22 ఏళ్ల నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది.

 

అదేవిధంగా, బాధిత బాలికకు రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై 2024లో నార్సింగి పోలీసులు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు ఇతర నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

 

విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదికలు తదితర ఆధారాలను పరిశీలించిన జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి ఈ తీర్పు వెలువరించింది. బాలలపై లైంగిక నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram