గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ మేజర్ గ్రామపంచాయతీ అయిన కరకగూడెంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామసభలో పూర్తిస్థాయిలో అధికారులు హాజరుకాకపోవడంతో గ్రామ సభను బహిష్కరించిన బిఆర్ఎస్ వార్డు సభ్యులు. గ్రామ సభకు సంబంధిత అధికారులు హాజరుకాకపోవడంపై నిరసన వ్యక్తం చేసిన బిఆర్ఎస్ వార్డు సభ్యులు సభను బహిష్కరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు గైర్హాజరు కావడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. అధికారులు హాజరై ప్రజల సమస్యలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
Post Views: 538








