⇒గ్రామ సభను అవమానించడం ప్రజాస్వామ్య విలువలను అవమానించినట్లే. గ్రామ సభకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.
⇒పోలేబోయిన సుజాత -కరకగూడెం సర్పంచ్.
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /కరకగూడెం మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ పాలేబోయిన సుజాత అధ్యక్షతన గ్రామసభ విజయవంతంగా నిర్వహించబడింది. అదే సమయంలో మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు జరుగుతున్న కారణంగా కొన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని సాకుగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులు, గ్రామసభకు హాజరై హాజరు నమోదుచేసి, గ్రామసభ ఎజెండాను పూర్తిగా విన్న అనంతరం ఉద్దేశపూర్వకంగానే సభ మధ్యలో బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లడం విచారకరం.గ్రామ సభను అవమానించడం ప్రజాస్వామ్య విలువలను అవమానించినట్లే. గ్రామ సభకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రామసభను రాజకీయ వేదికగా మార్చి అవమానించే ప్రయత్నం చేయడం బాధాకరం.
అయినప్పటికీ గ్రామసభను చివరి వరకు విజయవంతంగా నిర్వహించి, ప్రజలు ప్రస్తావించిన సమస్యలను నమోదు చేసుకున్నాం. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాం. అలాగే గ్రామసభకు హాజరు కాని అధికారుల విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిజేస్తాం. సర్పంచ్ తెలియజేశారు.








