యూపీఐ ఉచితమే కానీ..

యూపీఐ లావాదేవీలపై వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) కేవలం వ్యాపారులు, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలకే వర్తిస్తుందని తెలిపింది. అయితే ఈ భారం పరోక్షంగా వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాసెసింగ్ ఫీజులు, సర్వీస్ ఛార్జీలు లేదా వస్తువుల ధరలను పెంచడం ద్వారా ఖర్చును వినియోగదారుల నుంచే వసూలు చేసే అవకాశముందని పేర్కొంటున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram