వేటగాళ్లు అడవి జంతువుల కోసం అమర్చిన ఉచ్చులో చిక్కుకుని ఆవు మృతి

గోల్డెన్ న్యూస్ /కనకగూడెం / మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పోలే బోయిన వెంకయ్యకు చెందిన ఆవు వేటగాళ్లు అడవి జంతువుల కోసం అమర్చిన ఉచ్చులో (వచ్చులో) చిక్కుకుని ఆవు మృతి చెందింది పశువుల యజమాని తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం పశువుల మేత కోసం కన్నాయిగూడెం వీరాపురం మధ్యలోని అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్ళింది. వేటగాళ్లు అడవి జంతువుల కోసం అమర్చిన ఉచ్చులో (వచ్చులో) చిక్కుకొని మృతి చెందినట్లు పశువుల కాపరి తెలిపినట్లు పేర్కొన్నారు. దాని విలువ సుమారు 25 నుంచి 30 వేల దాకా ఉంటుందని ఆయన తెలిపారు. ఇది కేవలం పశువుల యజమానులకు ఆర్థిక నష్టమే కాకుండా, మూగజీవాల పట్ల జరిగే ఘోరమైన హింసకు నిదర్శనం.

Facebook
WhatsApp
Twitter
Telegram