పింఛన్‌దారుడు మరణిస్తే భాగస్వామికి వెంటనే పెన్షన్!

గోల్డెన్ న్యూస్/ తెలంగాణ / పింఛన్‌దారుడు మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే పెన్షన్‌ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘చేయూత’ పథకంలో భాగంగా దివ్యాంగులు, అనారోగ్య బాధితుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా భార్య లేదా భర్తకు పెన్షన్ ఇవ్వబడుతుంది. వితంతువులు, ఒంటరి మహిళలకు ఈ విషయంలో ప్రాధాన్యం ఉంటుంది. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేసేందుకు వీలుగా డీఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక లాగిన్ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram