విద్యార్థి పై దాడి చేసిన తోటి విద్యార్థులు

శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై దారుణంగా దాడి చేసిన తోటి విద్యార్థులు

 

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థి

 

రాత్రి సమయంలో హాస్టల్లో అభిషేక్‌ను కర్రలు, ప్లేట్లతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి దారుణంగా దాడి చేసిన 12 మంది విద్యార్థులు

 

తీవ్రంగా గాయపడిన తమ కుమారుడు మెట్ల మీద నుంచి కిందపడిపోయాడంటూ స్కూల్ యాజమాన్యం తమకు ఫోన్ చేసి చెప్పారని, వెంటనే వెళ్లి తమ కొడుకును ఇంటికి తీసుకొచ్చామని తెలిపిన బాలుడి తల్లిదండ్రులు

 

ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్

 

తనపై ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు దాడి చేశారని అభిషేక్ చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

 

తమ కొడుకుపై దాడి చేసిన వారిపై, ఘటన బయటకు రాకుండా దాచిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రుల డిమాండ్

Facebook
WhatsApp
Twitter
Telegram