గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్/ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. కాగా లైంగిక ఆరోపణల కేసులో పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పంజాగుట్ట పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది.
తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేశారని రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన వద్ద నుండి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రేగా కాంతారావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన కేసును విచారించిన ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది.
Post Views: 1,626









