మహిళకు తీవ్ర గాయాలు.. తేగిపడిన కుడి చెయ్యి.
గోల్డెన్ న్యూస్/ నల్లబెల్లి / వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని నగేష్ నూనె మిల్లులో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది.
రంగాపురం గ్రామానికి చెందిన కందకట్ల కవిత పల్లీలు పట్టించుకునేందుకు నూనె మిల్లుకు వచ్చింది.
మిల్లు నిర్వాహకురాలు జక్కుల శిరీష వాటర్ టిన్ కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
కవిత పల్లీపిండిని మిల్లు నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కుడిచేయి మిల్లు చక్రంలో ఇరుక్కుంది.
దీంతో కుడిచేయి తీవ్రంగా దెబ్బతిని తెగి కిందపడింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే కవితను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో నూనె మిల్లు వద్ద ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.
ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post Views: 38








