గోల్డెన్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందించడంలో పునాదులు వేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ నాయకులు తోలెం నాగేశ్వరరావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు, ఉపాధ్యక్షులు కల్తీ విజయ్, సర్పంచులు పోలేబోయిన సుజాత, తోలెం సావిత్రి, ఎర్రం పొట్టయ్య, SC సెల్ అధ్యక్షులు జాడి శ్రీను, సీనియర్ నాయకులు నేతాజీ, మండల నాయకులు చందా నాగేశ్వరరావు ,గొగ్గలి రవి, భూక్య రాందాస్, బరపటి వెంకన్న, కరకపల్లి నాగేష్, మైపతి శంకరయ్య, తోలెం కృష్ణ, మహిళా నాయకులు చందా రత్నమ్మ, పూణెం శ్యాం కుమారి, ఉప సర్పంచ్ పూజారి వెంకన్న, మాజీ ఉప సర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.








