ప్రజలను కదిలించి సమరశీల ఉద్యమాలు నిర్మించండి
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మిమ్మల్ని ఎంకన్న పిలుపునిచ్చారు శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన గ్రామాలలో పాలన వ్యవస్థ కొంటుపడిందని అధికారులు ఉన్న కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలను అమలు చేసే చిత్తశుద్ధి లేదని ప్రజా సమస్యలు కుప్పలుగా గా పేరుకుపోయాయని వేసవికాలం వచ్చిన తాగునీటి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఆరు గారెంటీ ల పథకాలతో హామీల వర్షం కురిపించాలని పూర్తిస్థాయిలో ఏ ఒక్క హామీ అమలు కాలేదు అని ఇచ్చిన హామీలు అమలు అయ్యేవరకు ప్రజలు పోరాటాలకు సిద్ధం గా ఉండాలని పిలుపునిచ్చారు సమస్యలు పరిష్కరించని యెడల పరిష్కారమయ్యే వరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు మండల కమిటీ సభ్యులు చెర్ప సత్యం, కొమరం మల్లక్క, పద్దం బాబురావు, నరసింహారావు, లక్ష్మయ్య అడమయ్య, పద్దం సత్యం, ఉంగయ్య, కనితి రాజు