కేటీఆర్ కు జైలు జీవితం తప్పదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్

గోల్డెన్ న్యూస్ /హనుమకొండ: మాజీమంత్రి కేటీఆర్‌కు జైలు జీవితం తప్పదని కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్‌కు ఇచ్చిన హామీలను మరిచిన దొంగ కేటీఆర్ అని విమర్శించారు. తమ ప్రభుత్వం చేసే అభివృద్ధి కేటీఆర్‌కి కనిపించడం లేదా… కళ్లు కనిపించకపోతే డాక్టర్ వద్దకు తీసుకుపోతానని ఎద్దేవా చేశారు నాయిని రాజేందర్ రెడ్డి.

 

ఇవాళ(శనివారం) హనుమకొండలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. పదిమంది లంపెన్ గ్యాంగులతో కేటీఆర్.. కాంగ్రెస్ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు నాయిని రాజేందర్ రెడ్డి.

తాము తలచుకుంటే రోడ్లపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు తిరగలేరని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే చూస్తు ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డికి సీఎం పదవి రాకముందు దూకుడుగా ఉండేవాళ్లమని… ఇప్పుడు తమ చేతులని హై కమాండ్ కట్టేస్తోందని చెప్పుకొచ్చారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మీ చెల్లె కవిత చెప్పింది నిజం కాదా అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram