జమ్మికుంటలో క్లినిక్ సీజ్ : రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ

రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్  నిర్వహిస్తే చట్ట చట్టపరమైన చర్యలు తప్పవు

 డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ చందు

గోల్డెన్ న్యూస్/ హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలోని ‘సెరా లైఫ్’ పేరుతో నడుస్తున్న ఒక క్లినిక్ను గురువారం డిప్యూటీ డీఎంహెచ్ఐ డాక్టర్ చందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆ క్లినిక్ ఎటువంటి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తోందని గుర్తించారు.ఈ సందర్భంగా డాక్టర్ చందు మాట్లాడుతూ. రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహించడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాలని, అప్పటివరకు క్లినిక్ ను మూసివేయాలని ఆదేశించారు.ప్రజలు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులచే మాత్రమే వైద్యం చేయించుకోవాలని, అర్హత లేని వైద్యులపై నమ్మకం ఉంచి ప్రాణాలను ప్రమాదంలో పడవేయవద్దని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ తనిఖీలోచేసుకోవాలని ఆయన కోరారు.ఈ తనిఖీలో రాజేందర్ రాజు (సబ్ యూనిట్ ఆఫీసర్), సిబ్బంది నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram