గోల్డెన్ న్యూస్ / ఆళ్లపల్లి : మండల పరిధిలోని ఆళ్లపల్లి అనంతోగు అడవిలో ప్రధాన రహదారిపై కారును అజాగ్రత్తగా నడిపి మోటార్ సైకిల్ ను ఢీకొట్టి ప్రమాదానికి కారకుడైన జార రమేశ్ (34) అనే వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్పై గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆళ్లపల్లి ఎస్ఐ ఎం.సోమేశ్వర్ వెల్లడించారు. బుధవారం రాత్రి ఆళ్లపల్లిలోని అనంతోగు సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొని రమేశ్ అక్కడికక్కడే మృతిచెందిన విషయం విదితమే. ఇల్లందులో రమేశ్ శవానికి పోస్టుమార్టం జరిపి, కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.
Post Views: 74









