రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి

ఓటు హక్కు వినియోగానికి బయలుదేరిన యువజీవితాలు బలి

 

హైదరాబాద్‌లో నివసిస్తూ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయేందుకు స్వగ్రామానికి బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి బైక్‌పై వెళ్తున్న బుర్ర కళ్యాణ్ (27), నవీన్ (27) అనే స్నేహితులను స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రాఘవపూర్ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

 

ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓటు హక్కు వినియోగించేందుకు బయలుదేరిన యువకుల మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram