గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం / భద్రాచలం పట్టణంలో ఓ వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రవి వర్మ అనే వ్యక్తిపై మంగళవారం మధ్యాహ్నం కొందరు యువకులు చర్ల రోడ్డు ప్రధాన రహదారిపై కొత్తలతో దాడి చేశారు తీవ్ర రక్తస్రావంతో రోడ్డు మీదే కుప్పకూలిన రవి వర్మను అక్కడున్న వారు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రవి వర్మ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా అక్కడి నుంచి తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోవడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. నడిరోడ్డుపై హత్య జరగడంతో భద్రాచలంలో ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. వ్యక్తిగత కక్షలా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.









