ఎన్నికల్లో ఓటమి.. వార్డు మెంబర్కు చీరలు, మద్యం బాటిళ్లు తిరిగిచ్చిన మహిళలు

గోల్డెన్ న్యూస్ / రామారెడ్డి / కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని రెండో వార్డు నుంచి వార్డు మెంబర్గా పోటీ చేసిన ఒక అభ్యర్థి, ప్రచారం సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వార్డులోని మహిళలకు చీరలు, పురుషులకు మద్యం బాటిళ్లను పంపిణీ చేసి, తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అయితే ఎన్నికల్లో సదరు అభ్యర్థి పరాజయ పాలయ్యాడు. ఓటమిని  జీర్ణించుకోలేకపోయిన ఆయన, ఆ రోజు గ్రామస్తులపై ఆగ్రహంతో వ్యక్తం చేశాడు.

 

ఓడిపోయిన మరుసటి రోజు నుండే ఆ అభ్యర్థి తన వార్డులోని ఇంటింటికీ తిరిగి. నేను మీకు చీరలు మద్యం ఇచ్చిన ఓట్లు వేయలేదని.. నా వస్తువులను నాకు తిరిగి విచ్చేయాలని అంటూ ఓటర్లను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులతో గొడవకు దిగి, దుర్భాషలాడటంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఓడిపోయిన అభ్యర్థి ఇలా వీధి రౌడీలా ప్రవర్తించడం చూసి విస్తు పోయిన గ్రామస్తులు ఓడిపోయిన వార్డు సభ్యునికి చీరలు, మద్యం బాటిళ్లు తిరిగిచ్చిన వార్డు మహిళలు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram