డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి.
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై పాము విసిరేందుకు ప్రయత్నించిన ఘటన పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద కలకలం రేపింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడన్న అనుమానంతో ట్రాఫిక్ పోలీసులు ఆటోను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో డ్రైవర్ కు 150 రీడింగ్ రావడంతో ఆటోను సీజ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు అతడు ఆటోలో నుంచి అకస్మాత్తుగా పామును తీసాడు.దీంతో ట్రాఫిక్ పోలీసులను బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది..
Post Views: 336









