గోల్డెన్ న్యూస్ /బీర్కూర్ / కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి లింగాల నాగ గిరీశ్‌పె లైంగిక వేధింపులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. బీర్కూర్ పీహెచ్‌సీలో బాదావత్ మౌనిక రెండేళ్లుగా ఆయుర్వేదిక్ ఫార్మసిస్టుగా పని చేస్తున్నారు. ఆరు నెలలుగా వైద్యాధికారి గిరీశ్ తనను లైంగికంగా వేధిస్తూ, అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెడుతున్నారని మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికెళ్తున్న తనను అడ్డుకుని గిరీశ్ తన బైక్‌పై తీసుకెళ్లాడని, ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో తెలిపారు. దీంతో గిరీశ్‌పై కేసు నమోదు చేసినట్లు బీర్కూర్ ఎస్‌ఐ మహేందర్ వివరించారు
Post Views: 455









