ఆసుపత్రి వార్డు అంటే మందుల వాసన, రోగుల మూలుగులు వినిపిస్తాయి.. కానీ అక్కడ మాత్రం నాగుపాముల బుసలు వినిపించాయి! తనను పరిచిన పాము ఏదో వైద్యులకు చూపించాలనే ఆలోచనతో ఒక వ్యక్తి ఏకంగా మూడు పాములతో ఆసుపత్రికి వచ్చాడు.
వివరాలకు వెళితే : –
బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లా రాజ్‌పుర్‌కు చెందిన గౌతమ్‌కుమార్ అనే పాములు పట్టే నిపుణుడు తాను పట్టుకున్న మూడు నాగుపాములను అడవికి తరలిస్తుండగా.. అందులోంచి ఓ పాము కరిచింది. మూడింటిలో ఏది కరిచిందో తెలియని గౌతమ్ వైద్యులకు చూపేందుకు ఆ మూడు విషసర్పాలతో నేరుగా సాసారాం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు.
Post Views: 69









