వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వాలి

యజమాని వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకోండి

ఆ వివరాలు సింక్ చేయండి, చలాన్ పడ్డ వెంటనే ఆటోమేటిక్‌గా డబ్బులు అకౌంట్ నుండి కట్ అవ్వాలి – సీఎం రేవంత్ రెడ్డి.

అరైవ్‌.. అలైవ్‌ పేరుతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూసుఫ్‌ గూడ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈనెల 13 నుంచి 24 వరకు మొత్తం 10 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలపై గ్రామాల్లో కూడా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రతి నిమిషం ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. దేశంలో ప్రతి 3 నిమిషాలకో ప్రాణం పోతుంది. రోడ్డు ప్రమాదాలతో జీడీపీపైనా ప్రభావం పడుతుంది. CM అభిప్రాయపడ్డారు.

Facebook
WhatsApp
Twitter
Telegram