ఇక సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయను : జగ్గారెడ్డి

గోల్డెన్ న్యూస్ / సంగారెడ్డి / సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇక జీవితంలో పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేసినా.. తాను ప్రచారానికి రానని తెలిపారు.. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తాను కానీ, సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేయనని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ ప్రచారం చేసినా తనను ఓడించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమికి పేదలు కారణం కాదని, ఇక్కడి మేధావులు, పెద్దలు అన్నారు. సంగారెడ్డిలో ఓటమి తన జీవితంలో మరిచిపోలేనిదని పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram