ఈ ఏడాది ఫిబ్రవరి 18 లేదా 19న రంజాన్ ప్రారంభం

ఈ ఏడాది ఫిబ్రవరి 18 లేదా 19న రంజాన్ మాసం ప్రారంభం

ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాదాపు 31 ఏళ్ల తర్వాత రంజాన్ మాసం ఫిబ్రవరిలో రావడం విశేషం. చివరిసారిగా 1995లో ఫిబ్రవరి 1న రంజాన్ మొదలైంది. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం, నెలవంక దర్శనం తర్వాతే రంజాన్ ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు పాటిస్తారు. సూర్యోదయానికి ముందు సెహ్రీ, సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ నిర్వహిస్తారు. రంజాన్ అనేది ముస్లిం క్యాలెండర్‌లో తొమ్మిదో నెల. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లిం పండితులు చెబుతారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram