కేరళ రాష్ట్రం పేరు మార్పుకు కేంద్రం పచ్చజెండా.
రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే పేరు మార్పు వ్యవహారంలో కేరళ కీలక మైలురాయిని చేరుకుంది. మలయాళీయుల ఆత్మీయ పిలుపు కేరళమ్‌ను అధికారికంగా ఖరారు చేసేందుకు కేంద్రం ప్రముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పేరు మార్చబోతున్నట్లు సమాచారం.దక్షిణాది రాష్ట్రం కేరళ తన అసలు పేరును తిరిగి పొందే దిశగా అడుగులు వేస్తోంది. కేరళ అనే పేరును అధికారికంగా కేరళమ్‌గా మారుస్తూ రాష్ట్ర అసెంబ్లీ పంపిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
Post Views: 18









