మియాపూర్‌లో స్టాఫ్‌ నర్సు ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ /మెదక్  / నారాయణఖేడ్ గ్రామానికి చెందిన మేఘవత్ సోని బాయి, మియాపూర్ మక్తలోని ఫస్ట్ హెల్త్ ల్యాబ్స్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ, రెడ్డి ఎంక్లవ్ లో పీజీ హాస్టల్ లో ఉంటూ జీవనం కొనసాగుతుంది.

 

ఒక సంవత్సరం నుండి ఫస్ట్ హెల్త్ క్లినిక్ లో పనిచేస్తుంది.సోమవారం సోని పనకి వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉంది గదిలో తోటి స్నేహితులు ఉద్యగాలకు వెళ్లారు. స్నేహాతులు రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ రూమ్ కు వచ్చి చూసేసరికి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నాయి. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు స్నేహితులు,హాస్టల్ యాజమాన్యం కిటికీ లోనుండి చూడగా సోని పైకప్పు ఉక్కు కు చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది.

 

  వెంటనే తలపులు బద్దల కొట్టి లోపలికి వెళ్లి కిందికి దించి మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు .

 

సహచరులు గుర్తించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

గత కొంతకాలంగా తన సొంత గ్రామానికి చెందిన ఓ యూవకుడు ఆమె ప్రేమించుకుంటున్నారు. వారి మధ్య గొడవలతో మనస్తపం చెంది ఉండవచ్చు.

 

కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram