పెంపుడు కుక్కకు అంత్యక్రియలు.. హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు..

పెంపుడు జంతువులను సొంత బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించే పెట్ లవర్స్ ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో ఆనారోగ్యంతో మరణించిన ఓ పెంపుడు కుక్కకు భద్రాద్రి జిల్లాలో సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు..

 

గోల్డెన్ న్యూస్/ పినపాక /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామపంచాయతీ పరిధిలోని ఉప్పాక గ్రామంలో ఒక పెంపుడు కుక్కకు గ్రామస్థులు బాగోద్వేదాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉప సర్పంచ్ రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కుక్క సంవత్సరాలుగా గ్రామంలోనే నివసిస్తూ, గ్రామస్థులతో ఆప్యాయ బంధాన్ని ఏర్పరచుకుంది. ఇటీవల అది మృతి చెందడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యుడిగా భావించి సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram