తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు: సీతక్క వార్నింగ్

గోల్డెన్ న్యూస్ /ములుగు /  తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.అబద్ధపు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పటించాలని చూస్తే ‘చెప్పు తెరుది’ అంటూ ఓ రేంజ్అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లలో అవినీతి జరిగిందన్న దుష్ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పు తెగుతదని హెచ్చరించారు. ములుగులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లకు రూ.11,650కు ఫోన్లు కొంటే.. రూ.14వేలు అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం పునర్నిర్మాణం పనుల్లో అవినీతికి తావులేదన్న సీతక్క.. ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. అవసరమైతే సీబీఐ విచారణ జరపాలన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram